నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ శనివారం అందాజ 9:30 గంటల సమయంలో ఉట్కూరు మండల కేంద్రంలోని భవాని టెంపుల్ లోని భవాని మాతను వినాయక భగవాన్ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి గణేష్ రూట్ మార్గాన్ని పరిశీలించారు. ముందుగా వివేకానంద చౌరస్తా నుండి పంచ మసీద్ మగ్దూంపూర్ చౌరస్తా భవాని మందిర్ బస్టాండ్ దేవి నగర్ కార్గిల్ చౌరస్తా భవాని మందిర్ ఉట్కూరు చెరువును పరిశీలించారు. కరెంటు కేబుల్ వైర్లను తొలగించాలని రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లను ముళ్ళ కంచెను తొలగించాలని సూచించారు.