హైదరాబాద్ నగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. మల్లాపూర్ లోని గణపతి మొబైల్ శేజమాని రాజు ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి గోపాల్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై అన్నదానం ప్రారంభించి, అందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.