కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఎమర్జెన్సీ విభాగంలో ఆయన పర్యటించి వైద్యులు అందిస్తున్న సేవలపై రోగుల బంధువులతో కుటుంబ సభ్యులతో చికిత్సపై ఆరా తీశారు. అక్కడే ఉన్న సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు రోగులకు సకాలంలో మందులు చికిత్సను అందించే దిశగా పనిచేయాలని ఆయన కోరారు.