ఇటీవల సారంగాపూర్ మండలం తాండ్ర (G) గ్రామంలో జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు.నిందితుడు మహమ్మద్ రహీం(23)తో పాటు దొంగ సొమ్మును కొనుగోలు చేసిన నాంపల్లి వెంకటేష్ (33)ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 2 కిలోల వెండి వస్తువులు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పి రాజేష్ మీనా తెలిపారు