బాన్సువాడ మండలం సంగోజిపేట గ్రామంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. గురువారం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు .వరుస వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు డయేరియా , డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండ ఉండేందుకు వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ఇమ్రాన్, HEO రవి ,సబ్ యూనిట్ ఆఫీసర్ సుధాకర్, MLHP మానస, ఆరోగ్య కార్యకర్తలు సునీత మంజుల పాల్గొన్నారు.