ఖమ్మం జిల్లా,వైరా నియోజకవర్గ కేంద్రంలో రైతులకు యూరియా సరఫరా చేయాలని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం తాసిల్దార్ కార్యాలయం ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు నిరసన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు రైతు సంఘం నాయకులు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ పంటలు సాగు చేసిన రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు యూరియా కొరత వలన పంటలు సాగుచేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని సరిపడా యూరియా అందకపోవడం వలన రైతులు సాగు చేసిన పంటలు నాసిరకంగా తయారయ్య అన్నారు