చిట్వేలు పంచాయతీ స్థలాలు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి రామసుబ్బారెడ్డి హెచ్చరించారు. చిట్వేలు పంచాయతీ కార్యాలయంలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. చిట్వేలు ప్రధాన రహదారి నుండి సత్యమ్మ గుడికి వెళ్లే దారిలో గల పంచాయతీ మోటారు నిర్వహణకు నిర్మించిన షెడ్డును గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేశారని తెలిపారు. వారిపై చిట్వేలు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.