ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ నాయకులు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి మంగళవారం ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసిన ప్రవీణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం పరిస్థితులను వివరిస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తుందని ప్రవీణ్ కుమార్ రెడ్డి జగన్ కి తెలిపారు. వచ్చేది మళ్లీ మన ప్రభుత్వమేనని ఎవరు అధైర్య పడవలసిన అవసరం లేదని కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు.