Araku Valley, Alluri Sitharama Raju | Aug 30, 2025
మౌళిక వసతుల కల్పన వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ తన పర్యటనలో భాగంగా పాడేరు లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల సందర్శించారు. నేటికీ చేపట్టిన పనులపురోగతి పై ఆరా తీశారు. లెక్చరర్ గ్యాలరీస్ పరిశీలించి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎనాటిమీ డిసెక్షన్ హాల్లో కడావర్స్ మరియు వాటి డిసెక్షన్ గురించి డాక్టర్ లక్ష్మీకుమారి గారిని అడిగి తెలుసుకున్నారు, బయో కెమిస్ట్రీ ఫిజియాలజీ ల్యాబ్స్ ని ఇన్స్పెక్ట్ చేశారు. పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. లైబ్రరీ విజిట్ చేసి ఈ లైబ్రరీ త్వరగా స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంచాలన్నారు.