మైదుకూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తూ ఉండేది. వేసవి వచ్చిన శీతాకాలం వచ్చిన మంచినీటికి ఇబ్బందులు ఎదురవుతుండేవి.ఈ విషయమై ఎమ్మెల్యే స్పందించి సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎర్ర చెరువుకు నీటిని నింపేలా ఉత్తర్వులు ఇచ్చారు. మూడేళ్లుగా ఎర్ర చెరువు నీటితో కళకళలాడుతుంది. మైదుకూరు మున్సిపాలిటీలో నీటి కష్టాలు తొలగిపోవడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.