మూడు రోజుల పర్యటన కోసం వైయస్సార్ జిల్లాకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంగళవారం పులివెందుల నుంచి అంబకపల్లి వెళ్తూ, నల్లపురెడ్డిపల్లె వద్ద తన కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులను కలిశారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార టీడీపీ గుండాల దౌర్జన్యంతో ఓటు వేయలేకపోయిన నల్లపురెడ్డిపల్లె గ్రామస్తులు, ఆ ఎన్నిక రోజున అక్కడి పరిస్థితిని శ్రీ వైయస్ జగన్‌కు తెలిపారు. జడ్పీటీసీ ఉప ఎన్నికరోజు అధికారపక్షం చేసిన అరాచకాలను వివరించారు.