అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వాగులు, వంకలు, అలుగు లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని నార్సింగి మండల తాసిల్దార్ గ్రేస్ బాయ్ అన్నారు. నార్సింగి మండలం లోని పలు చెరువులను కుంటలను ఆర్.ఐ శ్రీధర్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నార్సింగి మండలం రెడ్ అలర్ట్ లో ఉందని, గత మూడు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు చెరువులు కుంటలు వాగులు, పొంగి పొర్లుతున్నాయని, ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువులు, వాగులు, వంకల దగ్గరికి వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు. ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువ అన్నారు.