సింగరేణిలో పని చేస్తున్న కార్మికుల సొంతింటి కళను యాజమాన్యం నెరవేర్చాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం రామకృష్ణాపూర్ పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు సాంబారు వెంకటస్వామి, అల్లి రాజేందర్ లు మాట్లాడుతూ ఈ నెల 11, 12వ తేదీలలో సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులలో సొంతింటి కళపై కార్మికుల నుండి ఓటింగ్ నిర్వహించబడుతుందని, అలాగే 15వ తేదీన జిఎం కార్యాలయం ఎదుట చేసే ధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.