భారీ వర్షం, ఈదురుగాలులకు ఇల్లు కూలి, తృటిలో ప్రాణాపాయం తప్పిన ఘటన కన్నాయిగూడెం మండలంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. బాధితులు సారయ్య వివరాలు.. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం, ఈదురు గాలులతో చింతగూడెం గ్రామానికి చెందిన సారయ్య రేకుల ఇల్లు ఒక్కసారిగా కూలిపోయి, పైకప్పు గాలికి ఎగిరిపోయిందన్నారు. ఈ క్రమంలో బయటకు పరుగులు తీస్తుండగా రేకులు మీదపడి రాజక్క, సారయ్య ఇద్దరికీ గాయాలయ్యాయన్నారు.