నంద్యాల జిల్లా డోన్ మండలం కనుపకుంట గ్రామంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి చరన్ అనే పదవ తరగతి చదివే విద్యార్థి ఊరి చివర గనిలో ఈతకు వెళ్ళాడు. స్నేహితులతో కలిసి ఈత కొడుతూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు ఎంత వెతికినా చరణ్ కనపడకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గనిలో నుండి చరణ్ ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు