మూడున్నర దశాబ్దాలుగా రాయలసీమ వెనుకబాటు తనాన్ని ఓట్ల రాజకీయం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఉపయోగించుకుందని రాయదుర్గం MLA కాలవశ్రీనివాసులు అన్నారు. అనంతపురంలో జరుగుతున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏడాదిలోనే 80 శాతం హామీలను అమలు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. రాయలసీమ పేదరికం, కరువు పారద్రోలే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. జగన్ కు రాయలసీమలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు.