ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ గంపలగూడెం మండలంలోని వెనగడప తోటమూలా గ్రామం మధ్య ఉన్న కట్టలేరు వరకు భారీ వరద నీరు చేరుకుంది. శుక్రవారం ఉదయం ఎగువు నుంచి భారీగా వరద నీరు రావడంతో కట్టలేరు వంతెన పై రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు ఆ ప్రాంతంలో భారీ గేట్లు ఏర్పాటు చేసి రాకపోకలను రద్దు చేశారు. కట్టలేరు వాగు సమీపంగా ఉన్న నివాసాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు