మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సమీపంలోని వీటి పిఎస్ యాజమాన్యంపై లారీల యజమానులు తిరుగుబాటు చేశారు. వీటి పిఎస్ నుంచి వచ్చే బూడిద రవాణా విషయంలో లోకల్ లారీల యజమానులు శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు బూడిద రవాణా విషయంలో లోకల్ లారీలకు అనుమతి ఇవ్వాల్సిందే అంటూ పట్టు పట్టారు. దీంతో బూడిద రవాణా నిలిచిపోయింది.