శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలో పోలీసులు సోమవారం వాహనాలను తనిఖీలు నిర్వహించారు. కాంప్లెక్స్లో ఉన్న బస్టాండ్ పరిధిలోకి వాహనాలు రాకూడదని హెచ్చరించారు. వాహనాలకు చెందిన ఇన్సూరెన్స్తో పాటు, లైసెన్స్, పొల్యూషన్ వంటి ధ్రువపత్రాలతో వాహనాలను నడపాలని చోదకులను సూచించారు.