కరీంనగర్ శివారు లోని చింతకుంట నుంచి కొత్తపల్లి వెళ్లే బైపాస్ రహదారిపై ఓ భారీ గురువారం వృక్షం నేలకొరిగింది. ఈ బైపాస్ రోడ్డు గుండా జగిత్యాల, వరంగల్, నిజామాబాద్ వైపునకు నిత్యం వేలాది భారీ వాహనాలు, కార్లు, బైకులు రవాణా అవుతున్నాయి. రహదారిపై గల మూలమలుపు క్రాస్ పై పెద్ద చెట్టు నేలమట్టం అవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో ఈ రోడ్డుపై ఎలాంటి విద్యుత్ లైట్లు లేకపోవడం, ఎవరైనా వాహనదారుడు ఆగమరిచి అతివేగంగా వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి వృక్షాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేశారు.