పుల్లంపేట మండలం పుల్లారెడ్డి పల్లె గ్రామానికి చెందిన పుట్టబోయిన చరణ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసి సుమారు రూ. 5 లక్షల విలువైన 52 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని రాజంపేట రూరల్ సీఐ బివి. రమణ తెలిపారు. శుక్రవారం పుల్లంపేట పోలీస్ స్టేషన్లో మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు. పుల్లంపేట పిఎస్ క్రైమ్ నెంబర్ 108/2025 U/sec:305 BNS కేసులో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కడప- తిరుపతి రోడ్డు లోని రెడ్డిపల్లి క్రాస్ వద్ద పుల్లంపేట ఎస్సై బీవీ శివకుమార్ ముద్దాయిని అరెస్టు చేశారని ఆయన తెలిపారు.