ములుగు జిల్లా ములుగు మండలం పోట్లాపూర్ లో మిర్చి పంటను అడవిపందులు నాశనం చేశాయని రైతులు నేడు శనివారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు తెలిపారు. అదే గ్రామానికి చెందిన రాకేష్ రెడ్డి అనే రైతు యొక్క ఐదు ఎకరాల మిర్చి పంటకి నారు పోసుకోగా, రూపాయలు 50 వేల ఖరీదు చేసే గింజలు అడవి పందులు మొత్తం నాశనం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు మరియు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు.