బాన్స్ వాడ నియోజకవర్గ కేంద్రంలో గణేష్ నిమజ్జన ఊరేగింపులో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చిన్నారులతో కలిసి కోలాటం ఆడారు. 11 రోజులపాటు గణనాథుడిని కొలిచిన ప్రజలు శనివారం సాయంత్రం ఐదు గంటలకు నిమజ్జన శోభాయాత్రను నిర్వహించారు. శోభయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి చిన్నారులతో కలిసి కోలాటం ఆడడం అందరిని ఆకట్టుకుంది.