This browser does not support the video element.
విశాఖపట్నం: రుషికొండపై కరెంటు ఖర్చు రూ.1 కోటి: ఆశ్చర్యపోయిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
India | Aug 29, 2025
"ప్రకృతితో పెట్టుకుంటే ఉన్నది పోద్ది" అనే సామెతను గుర్తుచేస్తూ, రుషికొండ విషయంలో అదే జరిగిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన కట్టడాలను పరిశీలించేందుకు ఆయన శుక్రవారం రుషికొండను సందర్శించారు. గతంలో సంవత్సరానికి రూ.7 కోట్లు ఆదాయం వచ్చే రుషికొండపై ఇప్పుడు కేవలం కరెంటు కోసమే రూ.1 కోటి ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతికి నష్టం కలిగించి పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఇలా జరిగిందని ఆయన అన్నారు.