ఇక్కడ ఉన్న క్యూ లైన్ చంద్రగ్రహణము అనంతరం, దైవదర్శనానికి వెళ్లిన భక్తులు అనుకుంటే పొరపాటే. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మండుటెండలో యూరియా కోసం క్యూ లైన్లో వేచి ఉన్న రైతన్నలు. కోటబొమ్మాళిలోని ఓ ప్రైవేటు ఎరువుల షాపు వద్ద వివిధ గ్రామాలకు చెందిన సాగుదారులు నిలుచున్న దృశ్యం. ఎరువుల కొరతతో కొద్ది రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్న సంగతి విధితమే. మూడు గంటలు అవుతున్నా కూడా ఇంకా రైతులు క్యూ లైన్ లో నిలబడడం దారుణమని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.