రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు వరద పరివాహక ప్రాంతంలో దెబ్బతిన్న పంట పొలాలను రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల్లో చిక్కుకున్న వారిని అధికారులు సురక్షితంగా కాపాడి ఇంటికి చేర్చారని అలాగే వరద పరివాహక ప్రాంతంలో దెబ్బతిన్న పంటలను అంచనా వేసి రైతులకు నష్టం కలగకుండా నష్టపరిహారం మందేలా చూడాలని సందర్భంగా వారు కోరారు.