సూర్య ఘర్ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ అందివ్వాలి అన్న సీఎం చంద్రబాబు ఆశయాన్ని అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని రెస్కో చైర్మన్ ప్రతాప్ పేర్కొన్నారు. శాంతిపురం మండలం కోతిగుట్లపల్లి గ్రామంలో సూర్య ఘర్ సోలార్ విద్యుత్ ఏర్పాటు కార్యక్రమానికి సోమవారం రెస్కో కమిటీ సభ్యులు, టీడీపీ నేతలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.