వెంకటాపూర్ మండలం పాలంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ముందు నేడు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకే రైతులు యూరియాకోసం బారులు తీరారు. లైన్లలో నిల్చొని ఓపిక లేక చెప్పులతో క్యూ లైన్ ఏర్పాటు చేశారు. గతంలో యూరియా అందని వారందరికీ యూరియా ఇవ్వాలని నిర్వాహకులను రైతులు వేడుకుంటున్నారు. పీఏసీఎస్ పరిధిలోని గ్రామాల రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.