కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువు ప్రాంతంలో మహిళలు రోడ్డు వేయాలని నిరసన తెలిపారు. జగ్గయ్య చెరువు ప్రాంతంలో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని నాయకులు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు రోడ్డు వేయలేదన్నారు. తమ ప్రాంతానికి మంజూరు చేసిన రోడ్లు వేరే ప్రాంతంలో వేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దీనిపై చర్యలు తీసుకోవాలని సోమవారం పడ కార్యాలయం వద్ద మీడియా పూర్వకంగా కోరుతున్నారు.