వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం కేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి పిలుపునిచ్చారు. మంగళవారం జన్నారం మండలంలోని పలు గ్రామాల్లో వారు పర్యటించి ఆయా గ్రామాల్లో సిపిఎం శాఖల సమావేశాలు నిర్వహించారు. కేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులు కొరత విధించడం వల్ల 100 రోజులు పని చేసిన కూలీలకు గత 4 నెలలుగ సక్రమంగ కూలీ డబ్బులు రాని పరిస్థితి ఏర్పడ్డాయన్నారు. వ్యవసాయం,రైతుల సమస్యల పరిష్కారానికి ప్రజలు పోరాటాలకు సిద్ధంగ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా,మండల నాయకులు అశోక్,లింగన్న,బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.