రాయదుర్గం - అనంతపురం జాతీయ రహదారిపై వేపరాళ్ల క్రాస్ వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఓక మహిళా తీవ్రంగా గాయపడగా మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం 11.30 సమయంలో ఆటోలో కళ్యాణదుర్గం వైపు వీరంతా వెలుతుండగా ఆటో యాక్సిల్ కట్ అయి అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.