గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి: సీఐ నాగార్జున రెడ్డి శ్రీకాళహస్తి పట్టణంలోని వియ్యంపల్లిపట్టణంలోని వినాయక విగ్రహాల మండప నిర్వాహకులతో సీఐ నాగార్జున రెడ్డి గురువారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. గణేష్ నవరాత్రి శాంతియుతంగా జరిపేందుకు సూచనలు చేశారు. ధ్వని యంత్రాలు పరిమితంగా ఉపయోగించాలని, మద్యం సేవించిన వారిని అనుమతించొద్దని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, పిల్లల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, సమస్యలు తలెత్తితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.