నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాస రెండవ శుక్రవారం సందర్భంగా లక్ష్మి అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ తో అభిషేకాలు నిర్వహించారు. వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ తో అభిషేకించి, ప్రత్యేక పూజలు జరిపారు. ఎండు ఫలాలను పవిత్రమైనవిగా భావిస్తారు. వీటితో అభిషేకం చేయడం అమ్మవారికి ప్రీతికరమని భక్తులు నమ్ముతారు.