ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడు వద్ద సోమవారం బైకు కారు ఢీకొన్న సంఘటనలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసినదే. సంబంధిత వివరాలను పోలీసులు తెలియజేశారు. బొమ్మలాపురం కు చెందిన ఉప్పుతోళ్ల శ్రీను తమ గ్రామం నుంచి బైక్ పై దోర్నాలకు వస్తుండగా చిన్న గుడిపాడు మూలమలుపు వద్ద కారు వేగంగా ఢీ కొట్టిందన్నారు. దీంతో శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. బైకు ను ఢీకొన్న కారును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.