సిర్పూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది . బిజెపికి చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ తో పాటు రాష్ట్ర ఓబిసి మోర్చా కోఆర్డినేటర్ గోలెం వెంకటేశం, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షుడు ప్రశాంత్, కాగజ్నగర్ పట్టణ ఉపాధ్యక్షుడు రవికాంతులతో పాటు సుమారు 500 మంది కార్యకర్తలు బిజెపికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేస్తున్నట్లు బిజెపి నాయకులు తెలిపారు. త్వరలోనే బిఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి కేటీఆర్ సమక్షంలో చేరనున్నట్లు తెలిపారు,