పాముకాటుతో చిన్నారి మృతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చెంగేడు గ్రామానికి చెందిన గూడెపు మల్లయ్య కుమార్తె అయిన శాన్విశ్రీ అనే తొమ్మిది ఏళ్ల బాలిక పాముకాటుకు గురై మంగళవారం రాత్రి 1 గంటకు మృతి చెందింది. ఈ మేరకు గ్రామస్తులు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలిపిన వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే రాత్రి భోజనం ఆరగించే కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి వేళ పైనుంచి నాగుపాము చిన్నారి నిద్రిస్తున్న బెడ్ పై పడింది. ఆ వెంటనే నిద్రలో ఉన్న చిన్నారి చెవిపై కాటు వేసి పాము అక్కడి నుంచి పరుగులు తీసింది.