పత్తికొండలో వినాయక చవితి సంబరాలుమొదలయ్యాయి. ఈ సందర్భంగా పండ్లను దిగుమతిచేసిన వ్యాపారులు వాటిని సర్దుకుంటుండగా, భానుప్రసాద్ అనే తోపుడు బండి వ్యాపారి దానిమ్మ బాస్కెట్అడుగున నాగుపామును గమనించి మంగళవారం అవాక్కయ్యాడు.వెంటనే తోటి వ్యాపారులతో కలిసి పామును ప్లాస్టిక్సంచిలో వేసి దూరంగా తరలించారు. దీంతో అక్కడ కొంతసేపు వ్యాపారులో భయాందోళన చెందారు.