క్రైస్తవులు,పాస్టర్లు,దైవ సేవకులపై రోజురోజుకు పెరిగిపోతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని,పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై విచారణ జరపాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో పాస్టర్లు క్రైస్తవులు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందడం బాధాకరమని, నిరంతరం ప్రజా సంక్షేమం సమాజ శాంతి స్థాపనకు పాటుపడుతున్న పాస్టర్లపై దాడులకు పాల్పడడం బాధాకరమని అన్నారు.ఘటనపై దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.