ఈనెల 7న ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం మధ్యా హ్నం 12 గంటలకు (మూసివేత) ద్వార బంధనం చేయనున్నట్లు ఆలయ ఈవో, అర్చకులు తెలిపారు. 8వ తేదీన సోమవారం సంప్రోక్షణాది పూజ కార్యక్రమాలు చేసి ఉదయం 7.30 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.