స్వగ్రామం తుందుర్రు లో వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని వినాయకుడుకి ప్రత్యేక పూజలు చేసిన లండన్ డిప్యూటీ మేయర్ ఆరేటి ఉదయ్. ఆరేటి ఉదయ్ సెంట్రల్ లండన్ లోని రాయల్ బరో అఫ్ కెన్సింగ్టన్ అండ్ చెల్సీయా నగరానికి డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన తరువాత తోలి సారిగా స్వగ్రామం భీమవరం మండలం తుందుర్రు గ్రామం లో బుధవారం వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని వినాయకునికి ప్రత్యేకంగా పూజల నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు కుటుంబ సభ్యులు డిప్యూటీ మేయర్ ఉదయ్ నీ సాయంకాలం 6 గంటలకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరేటీ వీరాస్వామి నాయుడు ఎంపీటీసీ ఆరేటి వాసు మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.