ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసి కుల సంఘాలు, మేడారం సమ్మక్క సారక్క పూజారులు సమావేశం నేడు బుధవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేడారం అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి కాక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మేడారం లో ప్రభుత్వం 150 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులలో గద్దెల మార్పు, ఆదివాసి సాంప్రదాయాలకు అనుగుణంగానే ఏర్పాటు చేయడం జరుగుతుందని, జనవరిలో జరిగే మహా జాతరలోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరారు.