కడప జిల్లా పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతా రెడ్డి 6000 పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో శనివారం కడప పట్టణంలోని జెడ్పి సమావేశాల సందర్భంగా లతా రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ జడ్పీ చైర్మన్ రామ గోవిందరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో సీఈవో ఓబులమ్మ మారెడ్డి లతారెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.