విశాఖలోని బురుజుపేటలో ఉన్న ప్రముఖపుణ్య క్షేత్రం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం అష్టదళ పద్మారాధన నిర్వహించారు. 108 బంగారు పుష్పాలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారు జామునే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. తమ స్వహస్తాలతో అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళలు కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఏర్పట్లు చేశారు.