బల్మూరు మండలం లోని సీతాపురం గ్రామం నుండి తోడేళ్లగడ్డ మధుర నగర్ వరకు రోడ్డు కోసం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునివ్వడంతో బిజెపి నాయకులను బల్మూరు పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బల్మూరు మండల అధ్యక్షుడు బాలస్వామి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా స్వార్థ రాజకీయాల కోసం ముందస్తు అరెస్టులను చేస్తుందని అన్నారు.