మిలాద్ ఉన్ నబీ పర్వదినం రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని బుధవారం రాత్రి 9 గంటల సమయంలో జిల్లా ఎస్పీ పి.జగదీష్ పోలీస్ సిబ్బంది ఆదేశించారు. పోలీసు అధికారులు శాంతి కమిటీల సమావేశాలు నిర్వహించి మతసామరస్యంతో పండుగ మరియు ర్యాలీ కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన ముస్లిం సోదరులు నిర్వహించే ర్యాలీలు, ఊరేగింపులు జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. మసీదులు, దర్గాలు వంటి పవిత్ర స్థలాల వద్ద ముందుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.ప్రజలు శాంతియుతంగా పండుగను జరుపుకునేలా చూడాలన్నారు.