సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేద్దాం అని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి జిల్లా అధికారులతో పేర్కొన్నారు. శనివారం ఉదయం 12 గంటలు కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు కలెక్టర్ గా ఫస్ట్ పోస్టింగ్ అని తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు...కలెక్టర్ లుగా నియమితులైన వారందరితో ముఖ్యమంత్రి మాట్లాడారని, జిల్లాలను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చి దిద్దాలని ఆదేశించారన్నారు.