సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని రామ్ నగర్ లో కొండముచ్చులు వీరంగం సృష్టించాయి. శనివారం ఉదయం గాంధీనగర్ సమీపంలో ఇరువురిపై దాడి చేసి విపరీతంగా గాయపరిచాయి. కొండముచ్చుల దాడిలో శరణమ్మ, రాజ్ కుమార్ అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వారికి జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాంనగర్ ప్రాంతంలో గుంపులు గుంపులుగా తిరుగుతూ దాడి చేస్తున్నాయని, మహిళలు చిన్నారులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారని, మునిసిపల్ అధికారులు స్పందించి కొండముచ్చులను తరలించాలని స్థానికులు కోరుతున్నారు