నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మంగళవారం నందికొట్కూరు జనసేన పార్టీ నాయకులు రామిరెడ్డి ఆధ్వర్యంలో పటేల్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు రక్తదానం చేశారు,రక్తదాన శిబిరం విజయవంతం అయింది.40 మంది జనసేన పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొని రక్తదానం చేశారు, జనసేనపార్టీ రాబోయే రోజుల్లో మరింతగా పార్టీ బలోపేతం కావాలని అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని కార్యకర్తలు కోరారు,జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు అండగా నిలిచారన్నారు.