చిలకలూరిపేట పదో వార్డుకు చెందిన రహమతుల్లా అనే వివాహిత తనను హోంగార్డు ఇమ్రాన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, అతడి నుండి రక్షణ కల్పించాలని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఫిర్యాదు చేశారు.కుటుంబ వివాదంలో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్కూ వెళితే ఇమ్రాన్ పరిచయమై, గత 15 సంవత్సరాలుగా తనను ఆర్థికంగా, శారీరకంగా వాడుకుంటూ ఇబ్బంది పెడుతున్నాడని,తనతో సన్నిహితంగా ఉన్న వీడియోలతో బెదిరిస్తున్నాడని తెలిపింది.