వందేళ్ళ పైన చరిత్ర కలిగిన ఒంగోలు బాప్టిస్ట్ చర్చి వివాదాల్లో చిక్కుకుంది. గత ఆరేడు సంవత్సరాల నుంచి చర్చి కమిటీ సభ్యుల మధ్య వచ్చిన వివాదం చిలిపి చిలికి గాలి వాన లాగా మారింది. చర్చిలో కమిటీ సభ్యులు మూడు వర్గాలు గా విడిపోయారు. ఘనమైన చరిత్ర ఉన్న బాప్టిస్ట్ చర్చిలో గ్రూపుల మధ్య గొడవలు జరగటం తో బుధవారం పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దుబాటుకుందటం పరిపాటిగా మారింది. ఈరోజు ఓ వర్గం ప్రత్యేక ప్రార్థన చేస్తున్న సమయంలో మరో వర్గం పోలీసులను రంగంలోకి దించారు.